Gold super Fast | గోల్డ్​ ధర తగ్గదోచ్..​

Gold super Fast | గోల్డ్​ ధర తగ్గదోచ్​..

  • యథా​ స్పీడ్.. ​ తథా రేట్​
  • ఈ నెలలోనూ ఉరుకులు పరుగులే
  • 10 గ్రాముల ధర రూ.1.40,000 లకు చేరే అవకాశం

( ఆంధ్రప్రభ, బిజినెస్​ ప్రతినిధి)

Gold super  fast

మరో పది హేను రోజుల్లో పెళ్లిళ్ల ముహుర్తాల సైరన్​ మోగుతుంది. (gold super fast) భారత దేశంలో ఇప్పటికే 48 లక్షల జంటలు ఏడడుగుల ప్రాక్టీసులో బిజీబిజీగా ఉన్నాయి. మరో వైపు అమెరికా వడ్డీ రెపో (US Repo)  రేటు ఇండియన్​ కరెన్సీపై (INR)  ప్రభావం చూపనుంది. ఏతా వాతా బంగారం మార్కెట్టులో గోల్డ్​ ధర మరింత మెరిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Gold super Fast

Gold super  fast

ఇప్పటికే గత పది రోజుల్లో మూడు సార్లు స్వల్పంగా తగ్గిన బంగారం ధర తాజాగా మళ్లీ (Gold super Fast) జూలు విదిలించింది.  2025 నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు బంగారం ధరలు తమ ప్రతాపం చూపించాయి.  ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్ల కట్ ఆశలు, ఆర్థిక అనిశ్చితి,   భారతదేశంలో పెళ్లిళ్ల  సీజన్​ తో బంగారం  డిమాండ్  పెరుగుతోంది.

భారతదేశంలో 24 క్యారట్ బంగారం ధరలు (ప్రతి గ్రామ్‌కు రూపాయల్లో) గత పది రోజుల్లో   ₹12,513  నుంచి ₹13,058 వరకు పెరిగాయి. అంటే   బంగారం ధర  4.3% పెరిగింది.  అంతర్జాతీయ స్పాట్ ధరలు (డాలర్లలో ప్రతి ఔన్స్‌కు) $ 4,082 నుంచి $ 4,263 వరకు నిలకడగా ఉండగా, చివరి రోజు బుధవారం (డిసెంబరు 3న)  $ 4,206 కు చేరింది.

  Gold super Fast : ధర ఎందుకు పెరిగిందంటే

1.  ఫెడ్ వడ్డీ రేట్ల కట్ తో   అమెరికాలో లేబర్ మార్కెట్ (Labour Market)  బలహీన పడుతుంది.  ఆర్థిక మందగమనం తప్పదు. డిసెంబర్‌లో 25  బేసిస్ పాయింట్ల (Basic Points)  రేట్ కట్ (90% సంభావ్యత) అవుతుందని  ఆశలు పెరిగాయి. ఇది బంగారానికి  మద్దతు ఇస్తుంది. నవంబర్ 24 న ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ మాటలతోనే బంగారం  ధరలు పెరిగాయి.   

2.  నవంబర్ మొదటి వారంలో  అమెరికా ప్రభుత్వ షట్‌ డౌన్ ( Us Shut Down)   ముగిసిన తర్వాత ధరలు 6 వారాల ధరలు ఎగబాకాయి. ఇది ఆర్థిక అనిశ్చితిని పెంచి, బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించింది.

3.  భారతదేశంలో  నవంబర్ నుంచి –మార్చి వరకూ  వివాహాల సీజన్   వల్ల జ్యువెలరీ   ఇన్వెస్ట్‌మెంట్ కొనుగోళ్లు పెరిగాయి. గోల్డ్ ETFల్లో  ₹ 24  బిలియన్ల ఇన్‌ఫ్లో (నవంబర్ మొదటి 17 రోజుల్లో) ధరలను పైకి తీసుకెళ్లాయి. రూపాయి 3.3% ద్రవ్యోల్భణం కారణంగా  ఇంపోర్ట్ ధరలు పెరిగాయి.

Gold super  fast

4.  ఇక   ట్రేడ్ టెన్షన్స్  US  -చైనా ట్రేడ్ టెన్షన్స్ (Trade Tentions) ,  రష్యా, చైనా రాజకీయంతో    బంగారం ట్రేడింగ్​ లో   సేఫ్ –హేవెన్ (Safe Heaven) డిమాండ్ పెరిగింది.  చైనా, ఇండియా  సెంట్రల్​ బ్యాంకులు    బంగారం కొనుగోళ్లు పెంచాయి.

ఈ నెలలో ధరాఘాతమే డిసెంబర్‌లో బంగారం ధరలు 5 % నుంచి  -10%    పెరిగే అవకాశం ఉంది,. ఇన్వెస్టర్లు డిప్స్‌లో కొనాలి (₹1,25,000  – ₹1,30,000 లెవల్స్) కనిపిస్తున్నా,.  ETFలు ,  సావరిన్ బాండ్స్, అమెరికా  ఫెడ్ మీటింగ్ (డిసెంబర్ 10) తర్వాత గోల్డ్​  ట్రెండ్ క్లియర్ అవుతుంది.    ఈ కాలంలో  బుల్లిష్ ట్రెండ్‌లో ఉన్నాయి, 2025లో  59% పెరిగాయి. ఫెడ్ మీటింగ్ (డిసెంబర్)  ఇన్‌ఫ్లేషన్ డేటా భవిష్యత్ దిశను నిర్ణయిస్తాయి. ఇన్వెస్టర్లు డైవర్సిఫికేషన్ (Diversification)  కోసం బంగారాన్ని పరిగణించవచ్చు,

కానీ వోలటాలిటీ ఉంటుంది. 2025 డిసెంబర్ 3 నాటికి అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ధర $4,202  ప్రతి ఔన్స్ వద్ద ఉంది, భారతదేశంలో 24 క్యారట్ బంగారం (ప్రతి గ్రామ్‌కు) ₹13,058 వద్ద ట్రేడవుతోంది. 2025లో బంగారం ధరలు మొత్తంగా 59% పెరిగాయి,   డిసెంబర్‌లో కూడా బుల్లిష్ ట్రెండ్ (Bullish Trend) )  కొనసాగే అవకాశం ఉంది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం,

అంతర్జాతీయ ధర $4,200 నుంచి $4,500 వరకు (హై $4,793 వరకు) ఉండే అవకాశం కనిపిస్తోంది, చివరి వారంలో $4,565 వద్ద ముగియవచ్చు (7.3% పెరుగుదల). భారతదేశంలో ధరలు ₹1,30,000 నుంచి ₹1,45,000 (10 గ్రాములకు) వరకు చేరవచ్చు, మల్టీ-సిటీ యావరేజీ  ₹1,40,000 పైకి చేరుతుంది.  

Gold super  fast

Gold super Fast : గత 10  రోజుల్లో   ధర స్థితి గతి

డిసెంబర్  03, 2025₹13,058 (+71)₹11,970 (+65)
డిసెంబర్  02, 2025₹12,987 (-మైనస్ 61)₹11,905 (మైనస్ -55)
డిసెంబర్  01, 2025₹13,048 (+66)₹11,960 (+60)
నవంబర్  30, 2025₹12,982 (0)₹11,900 (0)
నవంబర్  29, 2025₹12,982 (+136)₹11,900 (+125)
నవంబర్  28, 2025₹12,846 (+71)₹11,775 (+65)
నవంబర్  27, 2025₹12,775 (మైనస్ 16)₹11,710 (-­ మైనస్ -15)
నవంబర్  26, 2025₹12,791 (+87)₹11,725 (+80)
నవంబర్  25, 2025₹12,704 (+191)₹11,645 (+175)
నవంబర్  24, 2025₹12,513 (మైనస్ -71)₹11,470 (-మైనస్ 65)

Also Read : Gold Rates | ప‌సిడి ప్రియులు.. త‌స్మాత్‌!

Leave a Reply