gold silver price| గోల్డ్, సిల్వర్ రేట్ ఢమాల్

gold silver price| గోల్డ్, సిల్వర్ రేట్ ఢమాల్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : అంతర్జాతీయంగా చోటుచేసుకున్న యుద్ధ పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతోంది. హర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన క్రమంలో స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. అలాగే బంగారం ధరలపై కూడా దీని ప్రభావం పడింది.ఒక రోజు పెరిగితే.. మరో రోజు నేల చూపు చూస్తున్నాయి. అయితే గురువారం బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గంటల వ్యవధిలోనే ఢమాల్ అన్నాయి. గోల్డ్ ధర భారీగా తగ్గడంతో కొనుగోలు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్. బంగారం కొనడం తప్పని సరి. బంగారం ధర తగ్గడంతో పెళ్లివారు జ్యువెలరీ షాపులకు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,480 వద్ద కొనసాగుతోంది. బుధవారం ఆ ధర రూ.1,53,820 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.2340 తగ్గిపోయింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,38,850గా ఉండగా.. నిన్న రూ.1,41,000 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.2150 పడిపోయింది.

ఇక వెండి ధరలు కూడా పడిపోయాయి. బెంగళూరులో కేజీ వెండి రూ.2.55 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.60 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.2.60 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.65 లక్షల వద్ద స్ధిరపడింది.
