Gold rate | పసిడి ధర మరింత పైకి.. ఆల్ టైం రికార్డ్ !!
దేశంలో బంగారం ధరలు మరోసారి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,430 పెరిగి రూ.88,500కి చేరింది. గత వారం, 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.86,070 వద్ద ముగిసింది. తాజాగా 10 గ్రాములకు రూ.2,430 పెరిగి రూ.88,500కి చేరింది. దీంతో ఆల్ టైమ్ రికార్డు ధరగా నిలిచింది.
అదేవిధంగా స్థానిక మార్కెట్లలో 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం ధర కూడా రికార్డు స్థాయికి పెరిగింది. నేడు 10 గ్రాముల ధర రూ.88,100కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. 99.9 స్వచ్ఛత కలిగిన వెండి కిలో రూ.1,000 పెరిగి రూ.97,500కి చేరుకుంది.
అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన ట్రెండ్, భారత రూపాయి విలువ తగ్గిపోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలని నిపుణులు చెబుతున్నారు.
అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి బలహీనత, ఆర్థిక అస్థిరతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు.. ఇతర అంశాలు కూడా బంగారం ధరల పెరుగుదలకి దారితీశాయి. ప్రస్తుత స్థితిగతులను పరిశీలిస్తే భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.