war effect | పాతాళానికి పసిడి

war effect | పాతాళానికి పసిడి
సిల్వర్‌ది అదే దారి..
విక్రయదారులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, మధ్యప్రాచ్య సంఘర్షణ, ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై యుద్ధ ప్రభావం నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం నాడు భారీగా పెరిగిన పసిడి రేట్లు తగ్గుముఖం పట్టాయి. వెండి ధర కూడా భారీగా తగ్గింది. రంజాన్ పండగ వేళ నేడు గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ తగ్గుదల బాట పట్టాయి. నిన్నకొంత పెరిగిన బంగారం, ఈ రోజు భారీగా తగ్గింది. వెండి నిన్న, ఇవాళ తగ్గుతూ వచ్చింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..


