ఊరు వాడ అభివృద్ధే గ్రామ సభ లక్ష్యం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఊరు వాడ సమగ్ర అభివృద్ధే గ్రామ సభల ప్రధాన లక్ష్యమని చిమ్నాపూర్ సర్పంచ్ కృష్ణగౌడ్ పేర్కొన్నారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం చిమ్నాపూర్ గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా గ్రామ సభలు వేదిక కావాలని తెలిపారు.

మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆయన పేర్కొన్నారు.

99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రతి తెలంగాణ పౌరుడు ఈ సంకల్పంలో భాగస్వామి కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోతిలాల్, గ్రామ కార్యదర్శి సునీత, వివిధ విభాగాల అధికారులు గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply