
global warming | కాలుష్యం చిన్న కారణమేనా?
global warming | కాలుష్యం చిన్న కారణమేనా?
global warming | ఆంధ్రప్రభ : భూతాపం పెరిగిపోవడానికి మేఘాలలో వస్తున్న మార్పులే కారణమని తాజా అధ్యయనం చెబుతోంది. వాతావరణ మార్పులు, పర్యావరణ అసమతులతకు వాయుకాలుష్యం ప్రధాన కారణమని, అడవుల నరికివేత, ఇతర కారణాలవల్ల భూతాపం పెరిగిపోతోందని ఇన్నాళ్లూ భావిస్తూ వస్తున్నాం. కానీ తాజా అధ్యయనం ప్రకారం కాలుష్యం.. ఓ చిన్న కారణం మాత్ర మే. అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఈ తరహా కాలుష్యం ప్రభావం కన్పిస్తోంది.
ఉత్తరార్ధగోళంలో కాలుష్యం కారణంగా భూతాపం పెరగడమన్నది పెద్ద విషయం కాదు. దక్షిణార్ధగోళంలో మాత్రం ఉష్ణోగ్రతలు పెరగడానికి కాలుష్యం ఓ కారణమే. కానీ.. మేఘాల పని తీరులో మార్పులే అసలు కారణం. సూర్యుడి నుంచి వచ్చే కాంతి, వేడిని, అతినీలలోహిత కిరణాలను ఓజోన్ పొర వడపోస్తుందని తెలుసు. ఆ పొరనుదాటి వచ్చే సూర్యరశ్మిని, వేడిని మేఘాలు అడ్డుకుని చాలా వరకు వెనక్కి తిప్పికొట్టేలా చేస్తాయి.
global warming | ప్రాంతాల వారీగా హెచ్చు తగ్గులు
మేఘాల వల్ల చాలా పరిమితంగా మాత్రమే సూర్యరశ్మి భూమి పైకి చేరుతుంది. అంటే భూతాపం పెరగకుండా మేఘాలు నియంత్రిస్తాయి. కానీ కొన్ని దశాబ్దాలుగా ఈ మేఘాలలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. గతంలో మాదిరిగా అవి దట్టం గాను, ప్రభావవంతంగాను ఉండటం లేదు. సూర్యరశ్మి ద్వారా వచ్చే ఉష్ణోగ్రతను తిప్పికొట్టే బదులు గతంకన్నా ఎక్కువగా శోషిస్తున్నాయి. అంటే భూమిపైకి ఆ వేడి చేరిపోతోందన్నమాట. ఫలితంగా భూతాపం పెరిగిపోతోంది. భూతాపం పెరుగుదల, ప్రాంతాల వారీగా హెచ్చు తగ్గులు వంటి అంశాల పై ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు.

ఈ అధ్యయనంలోని అంశాలను సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్లో ప్రచురించారు. దీని ప్రకారం మేఘాల పనితీరు, వాటి ఏర్పాటులో అనూహ్య మైన మార్పులు వచ్చినట్లు గుర్తించారు. గతంలో మాదిరిగా అవి సూర్య రశ్మి-వేడిని తిప్పికొట్టే బదులు.. గతం కన్నా ఎక్కువగా వేడిని గ్రహిస్తున్నా యి. ఫలితంగా భూవాతావరణంలో చేరే వేడి రానురాను పెరుగుతోంది.
global warming | భూగోళంలో మేఘాల పని తీరు
రెండు దశాబ్దాలుగా ఉపగ్రహాల ద్వారా సేకరించిన వాతావరణ మార్పులు.. ఇతర అంశాల డేటాను విశ్లేషించడం ద్వారా ఈ కొత్త సిద్ధాంతాన్ని ప్రకటించారు. వాయుకాలుష్యం వల్ల గాలిలో చేరే ఏరోసోల్స్(ధూళికణాలు)భూతాపం పెరగడానికి ప్రధాన కారణమని ఇన్నాళ్లూ భావించారు.
తాజా అధ్యయనం ప్రకారం.. వాయుకాలుష్యం కన్నా మేఘాల్లో మార్పులే భూతాపం పెరగడానికి కారణమని తేల్చారు. సూర్యుడి ద్వారా వచ్చే కాంతిని, వేడిని నియంత్రించేవి. ఫలితంగా ఉష్ణోగ్రతలు తగ్గేవి. కానీ ఇప్పుడు మొత్తం భూగోళంలో మేఘాల పని తీరు బలహీనమైంది.
అవి సూర్యరశ్మిని, వేడిని ఎక్కువగా గ్రహించి.. భూమి పైకి చేరేలా పరోక్షంగా కారణమవుతున్నాయని, ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఛాన్యోంగ్ పార్క్ పేర్కొ న్నారు. రొసెంటీల్ స్కూల్ డిపార్ట్మెంట్ ఆఫ్ అట్మోస్ఫియరిక్ సైన్సెస్లో ఆయన ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. భూతాపాన్ని నివారించే విధానాల రూపకల్పనకు తాజా అధ్యయనం ఉపకరిస్తుందన్నారు.
click here to read బంగ్లాదేశ్‌లో మారుతున్నరాజకీయ పరిస్థితులు
