రాయపట్నం అభివృద్ధి కోసం మరో అవకాశం ఇవ్వండి..

ధర్మపురి, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజలు రాయపట్నం గ్రామ అభివృద్ధి కోసం తనను మరోసారి గెలిపిస్తే గ్రామంలో అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి బియ్యాల తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదివారం గ్రామంలో ఇంటింటా తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
గతంలో గ్రామంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వాడవాడాలను సిసి రోడ్లు గ్రామంలో మంచినీటి బావులు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశానని మరోసారి అవకాశం కల్పిస్తే గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తారని మరో అవకాశం కల్పించాలని తిరుపతి ఓటర్లను కోరారు
