శ్రియా శరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. ఒకప్పుడు టాలీవుడ్ మొత్తాన్ని ఏలేసింది. చిరంజీవి దగ్గర నుంచి ప్రభాస్ వరకు.. సీనియర్, జూనియర్ అనే తేడాలేకుండా అందరి హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక కేరీర్ పీక్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని కొన్నేళ్లు సినిమాకు గ్యాప్ ఇచ్చింది శ్రియా. ఇక రీ ఎంట్రీలో కూడా ఈ చిన్నది తెలుగు, హిందీ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటుంది.
ఇక సినిమాల విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రాళ్లను కిర్రెక్కిస్తుంది. తాజాగా శ్రియా క్లివేజ్ షోతో కట్టిపడేసింది. పర్పుల్ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది. 42 ఏళ్ల వయస్సులో కూడా అమ్మడి అందం అస్సలు తగ్గలేదు. శ్రియ అందం చూసి ఈమె వయస్సు వెనక్కి వెళ్తుందనుకుంటా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.





