యాదాద్రిలో గిరి ప్రదక్షిణ

యాదాద్రిలో గిరి ప్రదక్షిణ

ఆల‌యంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావు పూజ‌లు


ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ‌ స్వామి వారి జన్మ స్వాతినక్షత్రం సందర్భంగా బుధవారం గిరిప్రదక్షిణ నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య , జిల్లా కలెక్టర్ హనుమంత రావు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.

Leave a Reply