జలధీశ్వరాలయం దర్శించిన హిందూ కాలేజ్ కరెస్పాండెంట్ …

జలధీశ్వరాలయం దర్శించిన హిందూ కాలేజ్ కరెస్పాండెంట్ …

ఘంటసాల – ఆంధ్రప్రభ : ఘంటసాలలోని శ్రీ బాల పార్వతి సమేత శ్రీ జలధీశ్వర స్వామి దేవాలయాన్ని మచిలీపట్టణం హిందూ కాలేజ్ సెక్రటరీ & కరెస్పాండెంట్ దైతా గోపాలకృష్ణ శాస్త్రి, వసంతి శాస్త్రి దంపతులు, హిందూ కాలేజ్ అధ్యాపకులు మండా కామ శాస్త్రి దర్సించి విశేష పూజలు నిర్వహించారు. ఎన్నో పుణ్య క్షేత్రాలు చూసినా ఇక్కడ ” శివ పార్వతులను ” ఏక పీఠం మీద దర్శించిన అనుభూతి విశేషం.

ఈ పుణ్య క్షేత్రం దర్శించడం పూర్వ జన్మ సుకృతం అని దైతా దంపతులు ఈ క్షేత్రం గురించి కొనియాడారు. అనంతరం వారికి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ గొర్రెపాటి రామకృష్ణ ,, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త గొర్రెపాటి జగన్మోహనరావు లు ఆలయ సత్కారం శేష వస్త్రాలతో చేసి ప్రతిమలు అందించారు. ఆలయ అర్చకులు దాలిపర్తి చలపతి రావు పూజాదికాలు నిర్వహించి ఆశీర్వదించారు.

Leave a Reply