Ghantasala | శ్రీకృష్ణదేవరాయ ఉత్సవాలు విజయవంతం చేయండి…

Ghantasala | శ్రీకృష్ణదేవరాయ ఉత్సవాలు విజయవంతం చేయండి…

Ghantasala |ఘంటసాల, ఆంధ్రప్రభ : ఈ నెల 10, 11 తేదీల్లో శ్రీకాకుళం గ్రామంలో జరిగే శ్రీకృష్ణదేవరాయ ఉత్సవాలను విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రత్యేకాధికారి పెనుమూడి సాయిబాబు అధికారులకు సూచించారు. శుక్రవారం శ్రీకాకుళేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ కృష్ణదేవరాయ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయలు అమూక్త మాల్యద కావ్యాన్ని శ్రీకాకుళేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలోనే రచించారని తెలిపారు.

అంతటి ఘనకీర్తి కలిగిన శ్రీ కృష్ణదేవరాయల మహోత్సవాలు వైభవోపేతంగా జరిగేలా ఆయా శాఖల అధికారులు బాధ్యతతో పని చేసి మహోత్సవాలను విజయవంతమయ్యేలా కృషి చేయాలని తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ మహోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి.విజయప్రసాద్, డిప్యూటీ ఎంపిడివో వెంకటేశ్వరరావు, ఎంపిటిసి సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు, డ్వాక్రా, అంగన్వాడీ, ఆలయ ఉద్యోగులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply