Ghanpur | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే…

Ghanpur | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే…

Ghanpur | గణపురం, ఆంధ్రప్రభ : మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాంతాల సమ్మిరెడ్డి తండ్రి పాపిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఈ రోజు జరిగిన దశదినకర్మకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, స్థానిక సర్పంచ్ వీరమల్ల సంపత్ రెడ్డి, ఉప సర్పంచ్ మొగిలి శంకర్, మాజీ సర్పంచ్ ఒద్దుల విజయ అశోక్ రెడ్డి, వీరమల్ల వీరారెడ్డి, ఒద్దుల మల్లారెడ్డి, మామిడాల శరత్ బాబు, జన్ను శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply