ఘ‌నంగా కొమురం జ‌యంత్యుత్స‌వం

ఘ‌నంగా కొమురం జ‌యంత్యుత్స‌వం

కడెం, ఆంధ్ర‌ప్ర‌భ : ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి, అమరుడైన గిరిజనుల ఆరాధ్యదైవం కొమురం భీమ్(Komuram Bheem) జ‌యంత్యుత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ రోజు కడెంలో కొమురం భీమ్ విగ్రహానికి ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణo(Padigela Bhushanao), కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి, ఆదివాసీ నాయకులు పూల‌మాల‌లు వేసిన నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భీమ్ ఆశయాలని స్ఫూర్తి గా తీసుకుని గిరిజన అభ్యున్నతి కోసం ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు కొమురం జగదీశ్ మల్లేష్(Komuram Jagadish Mallesh) తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply