generations |ఆదర్శంగా నిలిచిన మూడు తరాలు

generations |ఆదర్శంగా నిలిచిన మూడు తరాలు
కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి…
శివునిపల్లి 5వ వార్డులోని చిలగాని కుటుంబం
generations | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్ పూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శివునిపల్లిలోని 5వ వార్డులోని చిలగాని కుటుంబానికి చెందిన మూడు తరాల ఓటర్లు కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిం ది. కుటుంబ పెద్దలతో పాటు మనవళ్లు కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడం ప్రజాస్వామ్య పట్ల ఉన్న అవగాహనను ప్రతిబింబించిం ది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలు కలిసి పోలింగ్ కేంద్రానికి రావడం అక్కడి ఓటర్లను ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆ కుటుంబ సభ్యులు పిలుపుని చ్చారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ఇలాంటి సంఘటనలు ఆదర్శప్రా యమని స్థానికులు పేర్కొన్నారు.
