షిరిడి, ఆంధ్రప్రభ : ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం సింఘానియా, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి శ్రీ సాయిబాబా సమాధిని సందర్శించారు. దర్శనానంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్ష్ గాడిల్కర్ ఆయనను సత్కరించారు. బాబా వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమ్‌రాజ్ దారాడే, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తుషార్ షెల్కే పాల్గొన్నారు.
Shirdi | షిరిడీ సేవలో గౌతం సింఘానియా, రవిశాస్త్రి
