ఒడిశాలో గేట్లు ఎత్తివేత
ఇచ్ఛాపురం, ఆంధ్రప్రభ : ఒడిశాలో బాహుదా నది(Bahuda river) పై గల భగలట్టి డ్యామ్ 3 గేట్లు ఎత్తివేసినట్లు సమాచారం అందింది . ఇప్పటికే నదిలో 5 వేల క్యూసెక్కుల పైగా వరద నీరు ప్రవహిస్తోన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం బాహుదానది 4 1/2 అడుగుల నీటి మట్టానికి చేరుకున్నట్లు గుర్తించారు.
ప్రస్తుతానికి ప్రమాదకర స్థాయిలో లేనప్పటికీ ఒడిశా(Odisha) నుండి వరదనీరు చేరితే సాయంత్రానికి నీటి మట్టం మరిoత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరూ నదిలోకి దిగరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. 44 వేల క్యూసెక్కుల(Cusekkula) వరదనీరు చేరితేనే ప్రమాదకర పరిస్థితి భావించడం జరుగుతుందన్నారు.

