GATE-2025: ఫలితాలు విడుదల

హైదరాబాద్ : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2025) రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం అధికారులు ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌లో https://goaps.iitr.ac.in/login ఫలితాలు తెలుసుకోవచ్చు. GATE పరీక్షను ఐఐటీ రూర్కీ(IIT Roorkee) నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.
దేశవ్యాప్తంగా మొత్తం 8.37 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. సుమారు 80శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. స్కోరు కార్డులు మార్చి 28నుంచి మే 31వరకు డౌన్‌లోడ్ చేసుకునేందుకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. డౌన్‌లోడ్ ఆలస్యం చేస్తే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎంటెక్(EMTech), పీహెచ్‌డీ(PHD) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ GATE పరీక్షలు నిర్వహిస్తారనే సంగతి కూడా అందరికీ తెలిసిందే.
