కల్తీ అల్లం పేస్టు పట్టుకున్న పోలీసులు…

కల్తీ అల్లం పేస్టు పట్టుకున్న పోలీసులు…

తాండూర్ రూరల్, ఆంధ్రప్రభ : తాండూర్ నియోజకవర్గంలోని ​తాండూరులో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు: 600 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్.. కర్ణాటక తయారీ ముఠా గుట్టురట్టు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ SK. అన్వార్ పాషా సిబ్బంది వినూత్న రీతిలో దాడులు నిర్వహించి, భారీ ఎత్తున విక్రయిస్తున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠాను పట్టుకున్నారు.

నమ్మదగిన సమాచారం మేరకు తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించిన పోలీసులు, సుమారు 600 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు ఉపయోగించిన KA 39 9028 నంబర్ గల వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర గారు మాట్లాడుతూ”ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ లాభార్జనే ధ్యేయంగా కల్తీ పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

తాండూరులోని పాత కూరగాయల మార్కెట్ ప్రాంతానికి చెందిన రేపాల శ్రీధర్ (47) అనే వ్యక్తి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది తాండూర్ లో లేరు కల్తీ దందాలు కొనసాగుతున్నట్లు పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply