హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్కు గంగాధర్ రెడ్డికి ఆహ్వానం

నిజామాబాద్, స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : ఈనెల 8 నుండి 14 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర క్రీడా శాఖ సాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ టోర్నమెంట్ కు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి కే. గంగాధర్ రెడ్డికి ఆహ్వానం అందింది.
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ పరిపాలన అధికారి కె. అనిత, డిప్యూటీ డైరెక్టర్ జి. రవీందర్, అధికారులు వివిధ జిల్లా క్రీడాకారుల తో కలిసి గంగాధర్ రెడ్డిని టోర్నమెంట్ కు ఆహ్వానించారు. టోర్నమెంట్ కు ఆహ్వానించినందు కు గంగాధర్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ, కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. గంగాధర్ రెడ్డికి ఆహ్వానం రావడం పట్ల నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. లింగయ్య , కార్యవర్గ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందించారు.
