దొంగల ముఠా అరెస్ట్..

దొంగల ముఠా అరెస్ట్..

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పరిధిలో జరిగిన పలు ఇళ్ల దొంగతనాల కేసులను బ్రాహ్మణకొట్కూరు పోలీసులు చేదించారు. నంద్యాల ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు, నందికొట్కూరు సర్కిల్ సీ.ఐ పర్యవేక్షణలో బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ మణికంఠ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఫిబ్రవరి నెలలో బ్రాహ్మణకొట్కూరు, అల్లూరు గ్రామాలతో పాటు పాణ్యం ప్రాంతాల్లో జరిగిన ఇళ్ల దొంగతనాలకు సంబంధించి మొత్తం ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు 22 తులాల వెండి ఆభరణాలు, అర తులం బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపించారు. విచారణలో నిందితులు బ్రాహ్మణకొట్కూరు, అల్లూరు మాత్రమే కాకుండా పాణ్యం, కర్నూలు ప్రాంతాల్లో కూడా ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డట్లు వెల్లడైంది. రాబోయే వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఇళ్లలోని విలువైన వస్తువులు, ఆభరణాలను సురక్షితంగా లాకర్లలో ఉంచాలని బ్రాహ్మణకొట్కూరు ఎస్.ఐ మణికంఠ ప్రజలకు సూచించారు.

Leave a Reply