University | ఫేక్ విద్యా సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు..

University | ఫేక్ విద్యా సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు..

ఫేక్ విద్యా సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు..


University | నార్సింగి, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా నార్సింగిలో టెన్త్, ఇంటర్, డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న గ్యాంగ్‌ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పట్టుకుంది. నార్సింగిలోని ఒక స్థావరంపై దాడి చేసిన ఎస్ఓటీ బృందం – మిర్జా అక్తర్ అలీ బేగ్ అలియాస్ అస్లాం, మమ్మద్ అజాజ్ అమ్మద్, వెంకట్ సాయి, రోహిత్ కుమార్, ప్రవీణ్ అనే ఐదుగురిని పట్టుకుంది. వారి వద్ద పెద్ద మొత్తంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు స్వాధీనం చేశారు.

ఇక, ఎస్ఆర్ఎం యూనివర్శిటీ, బెంగళూరు సిటీ యూనివర్శిటీ పేర్లతో తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లు, అలాగే బోనాఫైడ్, ట్రాన్స్‌ఫర్ వంటి విద్యా ధ్రువపత్రాలను కూడా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా టెన్త్‌కు రూ.50,000, ఇంటర్‌కు రూ.75,000, డిగ్రీ సర్టిఫికేట్‌కు రూ.1.20 లక్షలు తీసుకుని విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

కొంతకాలంగా భారీగా డబ్బు సంపాదిస్తున్న ఈ గ్యాంగ్, అసలైన వాటితో తేడా తెలియకుండా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఎస్ఓటీ అదుపులోకి తీసుకున్న నిందితులను నార్సింగి పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply