అంత్య పుష్కరాల సమీక్ష సమావేశం వాయిదా

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : కాళేశ్వరం లో సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నిర్వహించాల్సిన సమీక్ష సమావేశం వాయిదా పడింది. ఉదయం 11.30 గంటలకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్యర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం దేవస్థాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాల్సి ఉండేది.
అయితే అనివార్య కారణాల వల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి మహేష్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశాన్ని ఈ నెల 6వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు చెప్పారు.
సరస్వతి నది అంత్య పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమగ్రంగా చర్చించనున్నట్లు వెల్లడించారు. అధికారులు సమయానికి హాజరుకావాలని దేవస్థానం వర్గాలు కోరాయి.
