Funding checks | కల్యాణ లక్ష్మి పేదలకు వరం

Funding checks | కల్యాణ లక్ష్మి పేదలకు వరం

  • రూ.1.53 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Funding checks | చిట్యాల, ఆంధ్రప్రభ : కల్యాణ లక్ష్మి పథకం నిరుపేద కుటుంబాల ఆడబిడ్డలకు వరమ‌ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం జయశంకర్, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో చిట్యాల 69, టేకుమట్ల 59, మొగుళ్లపల్లి 25, మండలాలకు చెందిన మొత్తం 153 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ1. 53,17,748 కోట్ల నిధుల చెక్కులను ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా, ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. నిరుపేద ఆడబిడ్డలకు చెక్కులు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో త‌హ‌సీల్దారులు, సునీతరెడ్డి, విజయలక్ష్మి, చిట్యాల ఆర్‌ఐ రాజేందర్, చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మి, వ్యవసాయ మార్కెట్ చైర్‌ప‌ర్స‌న్ గుమ్మడి శ్రీదేవి, మూడు మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Leave a Reply