ADB | గంజాయి కేసులో నలుగురికి ఐదేళ్లు జైలు..

ADB | గంజాయి కేసులో నలుగురికి ఐదేళ్లు జైలు..

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో నమోదైన గంజాయి రవాణా కేసులో నలుగురు నిందితులకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కోరికీ రూ.50,000 జరిమానా విధిస్తూ అసిఫాబాద్ స్టేషన్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ గారు తీర్పు ఇచ్చారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ వెల్లడించారు.

ఎస్పీ వివరాల ప్రకారం .. 2021 ఆగస్టు 21న జైనూర్ మండలం కాశిగూడ పటేల్ గ్రామ సమీపంలో బ్లూ కోల్ట్ పోలీసులు గస్తీలో ఉండగా, అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న లావుడ్య ఉద్దల్, గూగ్లోత్ భరత్‌లను ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి లభించింది. వీరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు.

విచారణలో వారి సమాచారంతో ఈ రవాణాకు సంబంధించి మరో ఇద్దరు… రాథోడ్ సవయిరామ్, రాథోడ్ విష్ణు పేర్లు బయటపడ్డాయి. నిందితులు నిర్మల్ జిల్లా బాబా నిర్మల్‌జిల్లాపూర్ తండాకు చెందిన లావుడ్య ఉద్దల్, గూగ్లోత్ భరత్, జైనూర్ మండలం కిషన్ నాయక్ తండాకు చెందిన రాథోడ్ సవయిరామ్, రాథోడ్ విష్ణు.

ఈ కేసులో అప్పటి ఎస్సై సిహెచ్. తిరుపతి, సీఐ హనుక్ విచారణను ముందుకు తీసుకెళ్లగా, కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగన్మోహనరావు బలమైన వాదనలు వినిపించారు. లైజనింగ్ ఆఫీసర్, సిడిపిఓ రామ్ సింగ్ సమన్వయం కల్పించారు.

సాక్ష్యాలు, దర్యాప్తు నివేదికలను పరిశీలించిన కోర్టు నిందితులను దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. విచారణను విజయవంతం చేసిన ఎస్‌ఐ రవికుమార్, సీఐ రమేష్, ఏఎస్పీ చిత్తరంజన్‌లను జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అభినందించారు.

Leave a Reply