రేపు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సుకు శంకుస్థాపన

కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ఎచ్చెర్ల నియోజకవర్గం పైడిభీమవరంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సుకు సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 11వ తేదీన వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం తెలిపారు. జిల్లాకు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరంలోని ఎఫ్ఎఫ్సీ (ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్)ను ఎకరాలు 1.99 సెంట్లు భూమిలో 14.60 కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు వివరించారు.

Leave a Reply