వడ్ల నందు ఫౌండేషన్ భరోసా..

వడ్ల నందు ఫౌండేషన్ భరోసా..
వికారాబాద్, ఆంధ్రప్రభ : సల్బత్తపూర్ గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డికి ఆర్థిక సాయం అందజేసిన వడ్ల నందు. బంటారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన రాజేందర్రెడ్డి గత కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మొత్తం బిల్లు 8,50,000 కాగా వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందు మాట్లాడి 2,00,000/-(రెండు లక్షల రూపాయల )బిల్లు మినహాయింపు చేసి అనంతరం ఐదు లక్షల రూపాయలను చెల్లించగా 5,00,000/-రూపాయలను బాధితులు చెల్లించగా ఆసుపత్రి బిల్లు 8 లక్షల 50000 (8,50,000/)రూపాయలు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వికారాబాద్ జిల్లాకు చెందిన వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్లందు తన వంతు సాయంగా 1,50,000 రూపాయలు ఆస్పత్రి యాజమాన్యానికి అందజేశారు.
ఆస్పత్రి సూపరిండెంట్ రవికి బుధవారం నాడు వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి వడ్లనందుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రాజేందర్ రెడ్డి చికిత్స సమయంలో తన సాయంగా లక్ష రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చి ప్రస్తుతం మొత్తం లక్ష యాభై వేల రూపాయలను చికిత్స నిమిత్తం అందజేసినట్టు నందు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల సోమరం సర్పంచ్ నరసింహారెడ్డి నాయకులు, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
