ప్రజా తీర్పును శిరసావహిస్తాం..

ప్రజా తీర్పును శిరసావహిస్తాం..
మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని మక్తల్ మున్సిపాలిటీని కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తామని మక్తల్ మాజీ ఎంపిపి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య అన్నారు. ఈ ఎన్నికల్లో ఓ వర్గం వారు గంప గుత్తగా ఓటు వేయడం వల్లనే కాంగ్రెస్కు మెజారిటీ వచ్చిందని మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం శనివారం మక్తల్ లో బిజెపి పట్టణ అధ్యక్షులు నూతనంగా 2వ వార్డు నుండి కౌన్సిలర్ గా ఎన్నికైన బి.రాజశేఖర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ తీర్పు రాబోయే జెడ్పిటిసి, ఎంపిటిసి, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు పార్టీ మెరుగుపడటానికి వీలవుతుందని అన్నారు.
ఓడిపోయిన అభ్యర్థులకు ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో అందుబాటులో ఉన్న నిధుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ గ్రాంట్లతో అభివృద్ధి చేశామని, ఎన్నికల్లో ఇంతకన్నా మెరుగైన అభివృద్ధి చేస్తామని చెప్పినా మంత్రి మాటలకు ప్రజలు నమ్మి మున్సిపల్ చైర్మన్ పదవికి సంపూర్ణ మెజార్టీ ఇచ్చారని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చవలసిన బాధ్యత మంత్రిపై ఉందన్నారు .వీధి వీధిలో సిసి రోడ్లు త్రాగునీరు వసతి ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని హామీలు ఇచ్చారని పునాదులే తీయని ఇంటిగ్రేటెడ్ స్కూలు, ఇంకా పూర్తికాని ఆసుపత్రి పదేపదే చేశానని చెప్పడం ప్రజలు విశ్వసించారని వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు.
ప్రచారంలో రాత్రి పగలు తేడా లేకుండా గల్లి గల్లి ఇల్లు ఇల్లు బైక్ పై తిరగటం మంత్రి దిగజారుడుతనానికి నిదర్శమని ఈ సందర్భంగా మాట్లాడిన 14వ వార్డు అభ్యర్థి రాధ భర్త సీనియర్ నాయకులు కావలి వెంకటేష్ అన్నారు. మంత్రి గత ఎన్నికల సందర్భంగా స్థానికుడిని తన మాయిముంత ఇక్కడే ఉంది రేపు చనిపోతే నన్ను ఇక్కడే పూడ్చి పెడతారని పదేపదే చెప్పి లబ్ధి పొందడం జరిగిందన్నారు. అందరూ ఆదరించి గెలిపించారు నేడు మంత్రి గా ఉన్నారు సంతోషమే. కానీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేకంగా 14వ వార్డు పరిధిలోనూ నా మాయిముంత ఇక్కడే ఉంది మీరంతా కాంగ్రెస్ను ఆదరించి గెలిపించాలి అని పదేపదే కోరడం ఇక్కడ ఏదైనా జరిగితే వాకిటి శ్రీహరి అనే తనకు మచ్చ వస్తుంద ని ఆ పరిస్థితి తీసుకురావద్దని కోరడం జరిగిందన్నారు.
ఒక మంత్రిగా మున్సిపల్ వార్డులో ఇంతలా మాట్లాడడం బాధాకరమన్నారు.ఈ ప్రాంతం వాకిటి వీధి కాదని 15 కులాలు కలిసి జీవిస్తున్న నేతాజీ నగర్ అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల్లో బిజెపి ఓటమి చెందినప్పటికీ నైతికంగా గెలుపు మాదే అని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో బిజెపి జిల్లా నాయకులు జి.బలరాం రెడ్డి, దేవరింటి నరసింహారెడ్డి, కావలి వెంకటేష్ ,నూతనంగా మున్సిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికైన పీకే .నరసింహ, టప్ప కృష్ణ ,ప్రధాన కార్యదర్శి కురువలింగం, టప్ప నరేందర్, బ్యాటరీ రాజు, రoకుల ఆంజనేయులు, రాము తదితరులు పాల్గొన్నారు.
