Forest Region | అంజన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే

Forest Region | అంజన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే

Forest Region | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నల్లమల్ల అటవీ ప్రాంతాని(Forest Region)కి ఆధ్యాత్మిక ప్రధాన కేంద్రంగా పేరుగాంచిన పదర మండలం మద్దిమడుగు గ్రామంలోని శ్రీ పబ్బతి అంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల రద్దీతో ఘనంగా కొనసాగుతున్నాయి. డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ(MLA Dr. Chikkudhu Vamsikrishna) ఈ రోజు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ఈవో రంగాచార్యులు, మాజీ చైర్మన్ దేశవతు రాములు నాయక్, పాలకమండలి సభ్యులు, వేదపండితులు ఎమ్మెల్యే వంశీకృష్ణను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ భక్తులతో మాట్లాడుతూ… పిలిస్తే పలికే దైవంగా, భక్తుల కొంగు బంగారంగా మద్దిమడుగు అంజన్న(Maddimadugu Anjanna)పై భక్తుల్లో నమ్మకం అనేక తరాలుగా ప్రజల మనసుల్లో నిలిచిపోయిందన్నారు. దేవస్థానం అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానన్నారు.

Leave a Reply