• రూ.ప‌ది ల‌క్ష‌ల చెక్కు అంద‌జేత‌


ఉట్నూర్ : అదిలాబాద్ (Adilabad) జిల్లా ఉట్నూర్ మండలంలోని రాజులమడుగు లో ఇటీవల అడవి పంది దాడిలో మృతి చెందిన కొడప లక్ష్మణ్ కుటుంబానికి అట‌వీశాఖ (Forest Department) ఆర్థిక సాయం చేసి ఆదుకుంది. ప్ర‌భుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షలు చెక్కును మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లక్ష్మణ్ భార్య కొడప లక్ష్మికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) అందజేశారు.

అడవి పంది దాడిలో లక్ష్మణ్ మృతి చెందడం బాధాకరమని, అయినా ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో పది లక్షల రూపాయలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే (MLA) పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ ఎఫ్ ఆర్ ఓ అరుణ, అటవీశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply