సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా (Sirisilla District)లోని గంభీరావుపేట (Gambhiraopet) సమీపంలో ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితుడు స్వామితో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ఫోన్లో మాట్లాడారు. భయపడొద్దని, అధికారులు మిమ్మల్ని కాపాడుతారని ధైర్యం చెప్పారు. స్వామితోపాటు మిగిలిన నలుగురు బాధితులు పిట్ల మహేశ్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి పరిస్థితిపైనా సంజయ్ ఆరా తీశారు. బాధితులెవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. జిల్లా కలెక్టర్ (District Collector) సైతం అక్కడే ఉంటూ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. అధికారులతో మాట్లాడి భోజనం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భయపడటం లేదని, అధికారులు కాపాడతారనే నమ్మకం ఉందని స్వామి చెప్పారు.
వరదలో చిక్కుకున్న వారికి కేంద్ర మంత్రి ఫోన్
