విజిబుల్ పోలీసింగ్ పాటించండి

విజిబుల్ పోలీసింగ్ పాటించండి

  • టెక్నాలజీ వినియోగించండి
  • బాధితులతో ఫ్రెండ్లీగా వ్యవహరించడి
  • పోలీసులకు నంద్యాల ఎస్పీ హితవు

నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : నంద్యాల జిల్లాలోని మహా పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్(One Town, Two Town Police Station)లు, శ్రీశైలం , సుండిపెంట పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌(SP Sunil Sheran) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్, లాకప్ గదులు, పలు రికార్డులను పరిశీలించారు.

ఎప్పటికప్పుడు రికార్డులు అప్డేట్ లో ఉంచాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్(Police Station)కు వచ్చిన బాధితులు నిర్భయంగా తమ సమస్యలను తెలిసే వాతావరణం కల్పించాలని, మర్యాదగా వ్యవహరించాలని, ఓపికతో సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించేందుకు కృషి చేయాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం(Srisailam) ఆలయ పరిసర ప్రాంతాలు నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉండేలా చూసుకోవాలన్నారు.

భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గుడి పరిసరాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోనే నంద్యాల జిల్లాలోని శ్రీశైలానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దైవదర్శనం నిమిత్తం ప్రతిరోజు వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి భక్తులకు ఎలాంటి ట్రాఫిక్(Traffic) ఇబ్బందులు కలగకుండా, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక దృష్టి ఉంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.

పెండింగ్(Pending) కేసుల విషయంలో ప్రత్యేక దృష్టి ఉంచి దర్యాప్తు విషయంలోనూ నేరస్తులను కనుగొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని(Technology) ఉపయోగించాలన్నారు. దసరా మహోత్సవాలు శ్రీశైలంలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు పండుగల సందర్భాలలో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఆదేశించారు. వీ ఐపీలు, వీవీఐపీలు దర్శన నిమిత్తం వచ్చినప్పుడు భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రోటోకాల్(Protocol) పాటించాలని అధికారులకు ఆదేశించారు.

ప్రతిరోజు విజిబుల్ పోలిసింగ్(Visible Policing) నిర్వహిస్తూ గంజాయి, మద్యం అక్రమ రవాణా జరగకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలన్నారు. స్టేషన్ ల పరిధిలలోని రౌడీ షీటర్లు, నేరచరిత్రులు, అనుమానితులపై నిఘా ఉంచి శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా అందరూ పనిచేయాలని ఆదేశించారు. అనంతరం శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో లువుతీరిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి(Srisaila Bhramaramba Mallikarjuna Swamy)ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్ పాల్గొన్నారు.

Leave a Reply