లోయర్ మానేరు డ్యామ్‌కు వరదపోటు
తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల నుండి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మోయా తుమ్మద వాగుకు మిడ్ మానేరు నుంచి అధిక నీరు ప్రవహిస్తోంది. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేర్‌కు 15 వేల క్యూసెక్కుల నీరు, రివర్ ఫ్రంట్ నుంచి 30వేల క్యూసెక్కుల గంట గంటకు వరద ఫ్లో పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం లోయర్ మానేరు డ్యాంలో 23689 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. లోయర్ మానేరు డ్యామ్ కెపాసిటీ 24 టీఎంసీలుగా ఉంది. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎస్ఆర్ఎస్పి అధికారులు 14 గేట్లు ఎత్తి 60వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎల్ఎండీ లోతట్టు ప్రాంతాల పరిసర ప్రజలు వాగు చుట్టూ పోవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

