25 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల విడుదల
కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల
4 టార్బాయిన్ ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి
బాల్కొండ (నిజామాబాద్ జిల్లా) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sri Ramsagar Project)కు 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుండడంతో 25 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీరు గోదావరి(Godavari)లోకి వదులుతున్నారు. మంగళవారం రాత్రి 26 వేల క్యూసెక్కుల వరద రావడంతో ప్రాజెక్టు అధికారులు బుధవారం ఉదయం 8 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరి లోకి 25 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇన్‌ఫ్లో (Inflow) పెరగడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు 17 గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల వదిలారు. క్రమంగా మధ్యాహ్నం 2 గంటలకు 25 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.50 టీఎంసీలు కాగా 1098.80 అడుగులు 79.65 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా నీటి విడుదలను అధికారులు కొనసాగిస్తున్నారు. ఇందిరమ్మ వరద కాలువ (Indiramma flood canal) హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ (Kakatiya Canal)కు 3వేల 500 ,ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరికి 4500 ,లక్ష్మీ కాలువ (Lakshmi Canal)కు 200 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. సరస్వతీ కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, గుత్ప అలీ సాగర్ కు 495 క్యూసెక్కులు(Cusekku), తాగునీటి కోసం మిషన్ భగీరథ (Mission Bhagirathaku)కు 231క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 666క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వెళ్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పోటెత్తుతున్న వరద
శ్రీరాంసాగర్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. దీంతో కాకతీయ కాలువకు 3వేల 500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4వేల 500 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. కాకతీయ, ఎస్కేప్ గేట్లకు నీటి సరఫరా చేయడంతో దిగువ జలవిద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి (Power Generation) అవుతోందని జెన్ కో డీఈ శ్రీనివాస్ తెలిపారు. నాలుగు టార్భాయిన్ల (Four Turbines) ద్వారా 36.20మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ సీజన్ లో 11.593 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని వెల్లడించారు.