ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ శివనగర్ శ్రీ శివ విఘ్నేశ్వర దత్త సాయి దేవాలయంలో వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్య ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఆదివారం 35వ డివిజన్ శివనగర్ శ్రీ శివ విఘ్నేశ్వర దత్త సాయి దేవాలయంలో ఉదయం వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్య హరహర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల జయ జయ ధ్వనాల మధ్య ధ్వజస్తంభ ప్రతిష్టాపన కన్నుల పండుగగా కొనసాగింది.

గత రెండు రోజుల నుండి ధ్జస్తంభానికి పూజారులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పూజలు నిర్వహించారు. భారీ క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని దేవాలయంలో ప్రతిష్టించారు హాజరైన మహిళా భక్తులు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం మా పూర్వజన్మ సుకృత ఫలంగా మహిళలుఅభివర్ణించారు.. ధ్వజస్తంభన ప్రతిష్టాపన మహోత్సవంతో దేవాలయంలో పూజలు పూర్తి అయ్యాయి.

కార్యక్రమంలో కొండి రాజమౌళి, చింతం యాదగిరి, రాపల్లి ఉపేందర్, కొత్త పెళ్లి శ్రీనివాస్ కొయ్యడ శ్రీధర్ , పాలకుర్తి శ్రీనివాస్ , శీలంఅశోక్ రెడ్డి, మారేడు పాక సతీష్ డాక్టర్ బి లక్ష్మీనారాయణ, డాక్టర్ చారి, డాక్టర్ బండి రమేష్, కుడి కాల సురేందర్, కోడం ప్రతాప్ కొత్తూరు రాజు,మాచర్ల నరేందర్, వీరాచారి, డివిజన్ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply