Flagpole | ధ్వజస్తంభం విరాళం…

Flagpole | ధ్వజస్తంభం విరాళం…
Flagpole | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swamy) ఆలయంలో ధ్వజస్తంభాన్ని నూతనంగా ప్రతిష్టించేందుకు రఘు స్వచ్చందంగా ముందుకు వచ్చి హామీ ఇచ్చారని మున్సిపల్ కౌన్సిలర్ గోపిశెట్టి శివ(Gopishetty Shiva) (అప్ప శివ) తెలిపారు.
ఆలయ అభివృద్ధి కోసం సేవాభావంతో ఇచ్చిన ఈ హామీ స్థానిక భక్తుల్లో ఆనందాన్ని నింపిందని, ధ్వజస్తంభం(Flagpole) ప్రతిష్టాపన ఆలయ వైభవాన్ని మరింతగా పెంచుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రఘుకు కౌన్సిలర్ అప్ప శివ, భక్తులు కృతజ్ఞతా పూర్వకంగా సన్మానం చేశారు.
