హత్యను ప్రోత్సహించారన్న ఆరోపణలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర సీపీఐ (CPI) కౌన్సిల్ సభ్యుడు చందూనాయక్ (Chandunayak) అలియాస్ చందూ రాథోడ్ (50) హత్యకేసులో మరో ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా మలక్‌పేట పోలీసులు (Malakpet Police) స్వాధీనం చేసుకున్నారు. చందూనాయక్ ను హత్య చేసింది నలుగురే అయినా.. వారికి మరో ఐదుగురు సహకరించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ప్రధాన నిందితుడైన రాజేష్ తో పాటు ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్, మున్నా, రాయుడు, రవీంద్రాచారి, యాదిరెడ్డిలను కేసులో నిందితులుగా చేర్చారు. జులై 15న ఉదయం చందునాయక్ శాలివాహన నగర్ పార్కు వద్ద వాకింగ్ చేస్తుండగా హత్యకు గురైన సంగతి విదితమే. భూ సెటిల్ మెంట్స్ చేయని కారణంగానే తన భర్తను చంపారని భార్య కూడా ఆరోపించారు.

