First One Day Match | భారత బౌలర్లదే హవా … తక్కువ స్కోర్ కే ఇంగ్లండ్ కట్టడి…
నాగపూర్ : మూడు వన్డేల సిరీస్లో భాగంగా నాగపూర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు జరుగుతున్న తొలి మ్యాచ్ లో టీమ్ ఇండియా బౌలర్లు హవా కొనసాగింది.. ఇంగ్లండ్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్లు జాస్ బట్లర్ (52), జాకబ్ (51) అర్ధశతకాలతో రాణించగా.. ఫిలిప్ సాల్ట్ 43 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, రవీంద్ర జడేజా 3, షమి 1, అక్షర్ పటేల్ 1, కుల్దప్ 1 వికెట్ తీశారు. భారత్ 249 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేయనుంది..