ఐఫోన్ సిరీస్‌లో నాలుగో తరం ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే వారం మార్కెట్లోకి వస్తున్నట్టు సీఈఓ టిమ్ కుక్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 19న ఇది మార్కెట్లోకి వస్తోంది. దీని ధర అందుబాటులోనే ఉంటుండడంతో వినియోదారుల్లో ఆసక్తి పెరిగిపోయింది. లోగోను మాత్రం ఆయన షేర్ చేశారు. అది సిల్వర్ కలర్‌లో మెరిసిపోతోంది. మా కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు వస్తున్నట్టు కుక్ ప్రకటించడంతో అది కచ్చతంగా ఎస్‌ఈ4 అయి ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 2022లో ఎస్‌ఈ సిరీస్‌ను ఆపిల్ తెచ్చింది. ఐఫోన్ 14 తరహాలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బేస్ వేరియంట్ దాదాపు 44 వేలు ఉంటుందని అంటున్నారు.
APPLE | వచ్చే వారమే మార్కెట్లోకి ఐఫోన్ ఎస్‌ఈ4
