బ్రహ్మాకుమారీస్‌-వినయము పెంచుకోవడము

అహంకారంతో ఉన్న సమస్య ఏమిటంటే అది ఎక్కడో లోపల దాగి ఉంటుంది. చాలా మందికి అసలు వారిలో అహంకారం ఉంది అని కూడా తెలీదు. దీని గురించి వారికి చెబితే అదివారిలోని గర్వాన్ని పెంచుతుంది, అంతే. అహంకారం ప్రేమను నాశనం చేస్తుంది. అది నేర్చుకునే కళను సంహరిస్తుంది. అప్పుడిక ఏ విధమైన ఇచ్చిపుకోవడాలు జరగవు. జీవితంలో ఎన్నో పరిస్థితులు దాటుతున్నప్పటికీ ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడము మాత్రం ఆగకూడదు అని జాగ్రత్త వహించాలి. వినయమును పెంచుకుంటే అహంకారమును జయించవచ్చు. మనలో నిజాయితి ఎంత ఉందో అంతగా మనలో వినయము పెరగాలి, అంటే ఎంత నిజాయితీగా ఉంటామో అంతే అణకువ మనలో పెరుగుతుంది. రెండూ కలిసి ఉండాలి, అణకువతో ఉండటం తెలిసినచోట ప్రేమ సమాప్తమైపోతుంది. పదే పదే వంగి వంగి ఉండాలి. వంగు, వంగు, వంగు.

దీని వెనక ఉన్న రహస్యమేమిటంటే భగవంతునితో ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడంలో ఎప్పుడూ విరామం రాకూడదు. ఈవిధంగా నీవు నీ హృదయాన్ని పటిష్టపరుచుకుని దేని కారణంగానూ గాయపడకుండా ఉండగలవు. ప్రేమను ఇచ్చుపుచ్చుకోవడం ఆగిపోవడానికి ముఖ్య కారణం గాయపడ్డ భావాలే.

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply