దుండగుల దుశ్చర్య

దుండగుల దుశ్చర్య
చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు భారీ వేప వృక్షానికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో మంటలు వ్యాప్తి చెందాయి. చెట్టు లోపలి భాగం కాలి పోతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై జి. శ్రావణ్ కుమార్, పంచాయతీ సెక్రెటరీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు, ఉపాధ్యాయులు రెండు గంటల శ్రమించి మంటలను అదుపు చేస్తున్నారు. పవర్ స్ప్రే తో చెట్టులోపలి భాగానికి నీటితో మంటలు ఆర్పేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతరం ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలం చేరుకొని మంటలు అదుపు చేశారు.
