Fire on | భోజనంలో గుడ్లు ఇవ్వడం అర్థరహితమా..?

Fire on | భోజనంలో గుడ్లు ఇవ్వడం అర్థరహితమా..?

Fire on | మధ్యాహ్న భోజనంపై గరికపాటి షాకింగ్ కామెంట్స్
సోష‌ల్ మీడియాలో ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్న నెటిజ‌న్లు
బ‌డిలో పేద పిల్ల‌ల‌కు భోజ‌నం పెడితే త‌ప్పేంట‌ని ప్రశ్న
పేద పిల్లల కోసం మధ్యాహ్న భోజన పథక ప్రాముఖ్యత
గరికపాటి వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం
విద్యా విధానంపై కొత్త చర్చ

Fire on | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : దేశంలో పేదరికంతో అనేక మంది పిల్ల‌లు చ‌దువుకు దూర‌మ‌వుతున్నారు. కుటుంబంలోని ఆర్థిక ప‌రిస్థితులు వారిని బడికి దూరం చేస్తున్నాయి. క‌నీసం ఒక్క పూట భోజ‌నం కూడా లేక అల‌మ‌టించే వారు ఎంద‌రో ఉన్నారు. అలాంటి పిల్ల‌ల ఆక‌లి తీర్చితే బ‌డిబాట ప‌డ‌తార‌నే ఉద్దేశంతో ప్రభుత్వాలు బ‌డుల్లో, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెడుతున్నాయి.

పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్న పిల్లలకు గుడ్డు, పాలు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, వారు చదువుపై శ్రద్ధ పెడ‌తార‌ని ఈ ప‌థ‌కాలను ప్ర‌వేశ పెడుతున్నారు. ఇవి అట్టడుగు వర్గాల పిల్లలను బడికి రప్పించే గొప్ప ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వాలు వేల కోట్లు వెచ్చిస్తున్నారు.

అలాంటి అద్భుత‌మైన ప‌థ‌కాల‌ను ప్రముఖ ప్రవచనకర్త గ‌రిక‌పాటి అప‌హాస్యం చేయ‌డంపై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. పేద‌ల కోసం ప్ర‌వేశ పెట్టే ప‌థ‌కాలను చిన్న‌చూపు చూస్తూ మాట్లాడ‌టం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని మండిప‌డుతున్నారు. పేద విద్యార్థులకు పెట్టే ఆహారం, ఇచ్చే పుస్తకాలపై ఆయన చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

గ‌రిక‌పాటి ఏమ‌న్నారంటే..
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు అందించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చదువుకోవాలనే కసి ఉన్న విద్యార్థి ఇంటి నుంచే అన్నం తెచ్చుకోవాలని, లేదంటే మానేయాలన్నారు. భోజనంలో గుడ్లు పెట్టడం వంటి నిర్ణయాలను “అర్థరహితం” అని కొట్టిపారేయడం, ప్రభుత్వం కేవలం విద్యాబోధనకే పరిమితం కావాలన్నారు. ఇవన్నీ ఉచితంగా ఇస్తుంటే విద్యార్థులు “శోభనం గదిలో పెళ్లికొడుకుల్లా” తయారవుతారని ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

click here to read స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు..

click here to read more

Leave a Reply