Fire Accident | తిరుప‌తిలో అగ్ని ప్ర‌మాదం – భారీగా ఆస్తి న‌ష్టం

తిరుపతిలో (Tirupathi) అగ్నిప్రమాదం (Fire Accident ) సంభవించింది. గోవిందరాజస్వామి ఆలయ (Govindaraja swamy temple ) సమీపంలో ఈ రోజు వేకువజామున (Early hours ) ఈ ప్రమాదం జరిగింది. ఆలయానికి దగ్గరలో ఉన్న రెండు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మొదట ఒక దుకాణంలో (shops ) మంటలు చెలరేగగా, ఆ తర్వాత అవి పక్క దుకాణానికి, ఆలయం ముందు వేసిన చలువ పందిళ్లకు (vandalers ) వ్యాపించాయని చెబుతున్నారు.

భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా దుకాణాల్లోని ఇత్తడి సామాన్లు, బొమ్మలు కాలిపోయాయి. ఒక దుకాణంలో విద్యుత్ షాక్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply