Fire Accident | గ‌రీబ్ ర‌థ్ ఇంజ‌న్ లో మంట‌లు …భ‌యంతో ప్ర‌యాణీకులు ప‌రుగులు

జైపూర్ – రాజస్థాన్‌లోని బీవర్ జిల్లా, సెంద్రా రైల్వే స్టేషన్‌లో ఆగిన గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. లోకోపైలట్ సత్వరం స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా రైలు నుంచి ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Also Read : Enforcement Directorate: గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు

ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు లోకోపైలట్‌న్ అప్రమత్తం చేశారు. దీంతో ఆయన వెంటనే రైలును నిలిపివేశాడు. గరీభ్‌రథ్‌కు మంటలు అంటుకున్న విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ లేదంటే సాంకేతిక సమస్య కారణంగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని తమ గమ్యస్థానాలకు చేర్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు పేర్కొన్నారు.

ఈ వార్త చదవండి .. TG | పదేళ్లు నేనే సీఎం అన్న రేవంత్ రెడ్డి… స్పందించిన‌ కోమటిరెడ్డి

Leave a Reply