Fire Accident | మంచిర్యాల గౌతమి నగర్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident | మంచిర్యాల గౌతమి నగర్‌లో అగ్ని ప్రమాదం

  • మూడున్నర లక్షల ఆస్తి నష్టం

Fire Accident | మంచిర్యాల సిటీ , ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమి నగర్ లో ఈరోజు డిప్యూటీ తహసిల్దార్ గృహంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో ఏసీతో పాటు వాషింగ్ మిషన్ ,నూతన వస్త్రాలతో పాటు ఫర్నిచర్(Furniture) కాలి బూడిదయ్యాయి. నెల రోజుల కిందట ఓ వివాహమైన కారణంగా ఇంట్లో సామానులు ఎక్కువ ఉండడంతో ఆస్తి నష్టం మూడు నర లక్షల మేర జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ అగ్ని ప్రమాదం(fire accident) సంభవించింది. మొదట మంటలు కొద్దిగా వ్యాపించి పొగ దట్టంగా పైకి లేవడంతో అగ్ని ప్రమాద శాఖకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఆఫీసర్ ఎస్ ఎఫ్ ఓ రమేష్ బాబు, సిబ్బంది టీ రాజేందర్ ,ఏ రమేష్ ,సిహెచ్ శ్రీకాంత్ ,సిహెచ్ రమేష్ మంటలను అదుపు చేశారు.

Leave a Reply