FINE | బాటిళ్లలో పెట్రోల్ కొట్టిస్తే జైలుశిక్ష!

FINE | బాటిళ్లలో పెట్రోల్ కొట్టిస్తే జైలుశిక్ష!
FINE | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఇళ్లలో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాన్ని నిల్వ చేయడం చట్ట విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. పెట్రోలియం చట్టం-1934 ప్రకారం ఇది నేరంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు.
డబ్బాలు లేదా ఇతర పాత్రల్లో ఇంధనాన్ని నిల్వ చేస్తూ పట్టుబడితే తొలిసారి రూ.1000 జరిమానాతో పాటు ఒక నెల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. అదే తప్పును మళ్లీ చేస్తే రూ.5 వేల జరిమానాతో పాటు మూడు నెలల జైలు శిక్ష పడుతుందని వెల్లడించారు.

ఇలాంటి నిల్వల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అటువంటి ఘటనలు చోటుచేసుకుంటే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు.
