ఇందూర్ లో సినీ తార నిధి అగర్వాల్ సందడి..

ఇందూర్ లో సినీ తార నిధి అగర్వాల్ సందడి..
- అట్టహాసంగా ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ మహోత్సవం..
- సెల్ఫీలతో అభిమానుల సందడి..
నిజామాబాద్, ఆంధ్రప్రభ : ఇందూర్ లో సినీ తార నిధి అగర్వాల్ సందడి చేసింది. నిజామాబాద్ నగరంలోనీ రాష్ట్రపతి రోడ్డు లో గురువారం ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ మహోత్సవం అట్ట హాసంగా నిర్వహించారు. ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ డైరెక్టర్లు ఎస్ .రాజమౌళి, పి. వెంక టేశ్వర్లు, టి. ప్రసాద్ రావు లు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు.

ఈ ప్రారంభోత్సవ మహోత్సవానికి సినీతర నిధి అగర్వాల్ ముఖ్య అతి థిగా హాజరై జ్యోతి ప్రజ్వ లన చేసి మెగా షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ తారను చూడడానికి అభిమానులు పోటెత్తారు. మెగా షాపింగ్ మాల్ లో నూతన వస్త్రాలతో నిధి అగర్వాల్ ఫోటోలు దిగుతూ సందడి చేశారు. నిధి అగర్వాల్ చూడ డానికి అభిమా నులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

హాయ్ హలో… నిజామాబాద్ అంటూ అభిమా నులలో జోష్ నింపారు.ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ డైరెక్టర్లు ఎస్ .రాజమౌళి, పి. వెంక టేశ్వర్లు, టి. ప్రసాద్ రావు లు మాట్లా డారు. ప్రారంభో త్సవాన్ని పురస్క రించుకొని ప్రత్యే కమైన ఆఫర్లను అందజే స్తున్నామని తెలిపారు. ఇందూర్ ప్రజలు ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షాపింగ్ మాల్ డైరెక్టర్లు కోరారు.

ఇందూర్ కు రావడం చాలా సంతోషంగా ఉంది
సినీ తార నిధి అగర్వాల్
ఇందూర్ కు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని సినీ తార నిధి అగర్వాల్ అన్నారు. ఇంత పెద్ద ఎత్తున అభిమా నులను చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది.
