బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామ బ్రిడ్జిపై ఈ రోజు సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్(Hyderabad) నుంచి విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు(BMW car) అదుపుతప్పి ముందున్న లారీని వెనక నుండి ఢీకొట్టి కారు అదుపుతప్పి గాలిలో చెక్కర్లు కొడుతూ పక్కన వెళ్తున్న మరో స్విఫ్ట్ కారు(Swift car)పై పడింది.
ఈ ఘటనలో బీఎండబ్ల్యూ కారులో వెళ్తున్న ఇద్దరికీ సల్ప గాయాలయ్యాయి. రెండు కార్లు కొయ్యలగూడెం బ్రిడ్జిపై రోడ్డుకు అడ్డంగా పడడంతో రెండు వైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్(Inspector Manmadha Kumar), ఎస్సై ఉపేందర్ రెడ్డితో కలిసి ప్రమాదం జరిగిన స్థలాన్ని చేరుకొని గాయపడిన ప్రయాణికులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)కి తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడిన రెండు కార్లను క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


