AP | గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

  • రెండు బైకులు ఢీ
  • ముగ్గురు అక్కడికక్కడే మృతి..
  • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఏటుకూరు – వింజనంపాడు రహదారి మధ్య పెట్రోల్ బంకు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు కి తీవ్ర గాయాలు కావడంతో వైద్యశాలకు తరలించారు.

సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. మృతుల‌ వివరాలు తెలియాల్సి ఉంది. నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply