బాపట్ల జిల్లాలో ‎ఘోర రోడ్డు ప్రమాదం

నలుగురు మృతి

‎బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ : ‎బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా.. ఇద్దరు బాలురు గాయపడ్డారు. మృతులు కర్లపాలెంకు చెందిన బేతాళం బలరామరాజు(65), లక్ష్మి (60), పుష్పవతి (60) శ్రీనివాసరాజు (54)గా గుర్తించారు.

‎బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయాల పాలైన ఇరువురిని గుంటూరు ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన డ్రైవర్ కుమారుడికి ఈ నెలలోనే వివాహం జ‌ర‌గాల్సి ఉంది. మృతుల బంధువుల రోదనలు చుట్టుపక్కల వారిని సైతం కంటతడి పెట్టించాయి.

Leave a Reply