రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం..

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం..

మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : రైతుల అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, సహకార సంఘం జిల్లా మానటరింగ్ అధికారి రజితలు అన్నారు. తిప్పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలోని చెర్వుపల్లి, ఇందుగుల గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డిసిసిబి మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, తిప్పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ బిక్షమయ్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలన్నారు. ఈ కార్యక్రమం లో చెర్వుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ వడ్డే సైదిరెడ్డి, నాయకులు ఇటికాల నాగిరెడ్డి, ఉప్పు.బంగారు, ఉప్పు వెంకన్న, హమాలీలు చెరుకుపల్లి సోములు, అలంపల్లి నరసింహ, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మునుగోటి యాదగిరి, ఇందుగుల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కల్లు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ కట్టా శ్రీనివాస్ రెడ్డి, సతీష్, లతోపాటు రైతులు హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply